అరిన్‌ డాటర్‌ ఆఫ్‌ అసిన్‌ | Asin celebrates daughter Arin's first birthday | Sakshi
Sakshi News home page

అరిన్‌ డాటర్‌ ఆఫ్‌ అసిన్‌

Oct 27 2018 2:44 AM | Updated on Oct 27 2018 2:44 AM

Asin celebrates daughter Arin's first birthday - Sakshi

ఆసిన్‌, రాహుల్‌, అరిన్‌

‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గజిని’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలబార్‌ బ్యూటీ ఆసిన్‌. 2016లో రాహుల్‌ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో విడుదలైన ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అసిన్‌ చివరి చిత్రం.  గతేడాది ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే ఆ పాప ఫొటోలను కానీ, పేరుని కానీ మీడియాతో పంచుకోలేదు. ఇప్పుడు మా అమ్మాయి ‘అరిన్‌’ అంటూ పాప మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ బర్త్‌డే ఫొటోలను  పంచుకున్నారామె. ‘‘మా చిన్నారి పాప అరిన్‌కి హ్యాపీ ఫస్ట్‌ బర్త్‌డే’’ అన్నారు అసిన్‌. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ముంబైలో ఉంటున్నారు అసిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement