నాన్నకు ప్రేమతో.. సూపర్‌స్టార్‌కు కొడుకు గిఫ్ట్!
బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ఒక మంచి నాన్న. తన పిల్లల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ సూపర్ స్టార్.
బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ఒక మంచి నాన్న. తన పిల్లల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ సూపర్ స్టార్. వాళ్లు సాధించిన వాటిని గర్వంగా సోషల్ మీడియాలో ప్రకటించి ఓ తండ్రిగా మురిసిపోతాడు కింగ్ ఖాన్. ఇప్పటివరకు అబ్రామ్ ముద్దుముద్దు ఫొటోలు షేర్ చేస్తూ.. అర్యన్, సుహానా చిన్నచిన్న విజయాలను ఘనంగా సోషల్ మీడియాలో ప్రకటించి.. వారిని అభినందించిన షారుఖ్ కు 'నాన్నకు ప్రేమతో' అంటూ ఓ గిఫ్ట్ అందింది.
పెద్ద కొడుకు అర్యన్ ఈ కానుక ఇచ్చాడు. అతి త్వరలో షారుఖ్ తాజా సినిమా 'ఫ్యాన్' విడుదల కాబోతున్నది. ఇందులో టైటిల్ సాంగ్ 'జబ్రా ఫ్యాన్'ను గిటార్ మీద అద్భుతంగా వాయించి అబ్బురపరిచాడు అర్యన్. ఆ వీడియోను తాజాగా షారుఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ' నా కొడుకు నా కోసం ఇది చేశాడు. నాకు కూడా గిటార్ వాయించడం వచ్చినుంటే ఎంత బాగుండు' అంటూ మురిసిపోతూ చెప్పాడు.


