ఒక్కటవుతున్నాం | Arya to marry Sayyesha in March | Sakshi
Sakshi News home page

ఒక్కటవుతున్నాం

Feb 15 2019 3:56 AM | Updated on Feb 15 2019 5:33 AM

Arya to marry Sayyesha in March - Sakshi

ఆర్య, సాయేషా

శుభవార్తను పంచుకోవడానికి వేలంటైన్స్‌ డేను సందర్భంగా చేసుకున్నారు తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా. ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. ఆర్య, సాయేషా మాత్రం ఆ వార్తకు ‘ఊ’ అనలేదు ‘ఊహూ’ అని కూడా అనలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘మేం ఒక్కటవుతున్నాం’ అని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేం పెళ్లి చేసుకోబోతున్నాం.

ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మార్చిలో పెళ్లి. మా సరికొత్త ప్రయాణంలో మీ ప్రేమ, అభిమానంతోపాటు ఆశీర్వాదాలను కూడా కోరుకుంటున్నాం’’ అని ఓ లేఖలో ఆర్య, సాయేషా పేర్కొన్నారు. మార్చి మొదటివారంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ‘‘ఆర్యను మా ఇంటి అల్లుడిగా స్వాగతించడానికి ఆనందిస్తున్నాం’’ అని సాయేషా తల్లి షహీన్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. ‘అఖిల్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయేషా ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
∙ఆర్య, సాయేషా

Advertisement
 
Advertisement
Advertisement