పోలీస్ అధికారిగా అరుల్ నిధి | arul nidhi in police officer carector | Sakshi
Sakshi News home page

పోలీస్ అధికారిగా అరుల్ నిధి

Jan 24 2016 2:36 AM | Updated on Sep 17 2018 6:26 PM

పోలీస్ అధికారిగా అరుల్ నిధి - Sakshi

పోలీస్ అధికారిగా అరుల్ నిధి

మళ్లీ పోలీస్ కథల ట్రెండ్ మొదలైందనిపిస్తోంది. తెరి చిత్రంలో విజయ్, సేతుపతి చిత్రంలో విజయ్‌సేతుపతి పోలీస్ అధికారి పాత్రల్లో నటిస్తున్నారు.

మళ్లీ పోలీస్ కథల ట్రెండ్ మొదలైందనిపిస్తోంది. తెరి చిత్రంలో విజయ్, సేతుపతి చిత్రంలో విజయ్‌సేతుపతి పోలీస్ అధికారి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తానూ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా వస్తున్నానంటున్నారు యువ నటుడు అరుళ్‌నిధి. డిమాంటీ కాలనీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆయన హీరోగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ అధినేత ఎన్.రామస్వామి నిర్మిస్తున్న చిత్రం ఆరాదుచిన్నం.

ఐశ్వర్యారాజేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధారవి, తులసి, రోబోశంకర్, ఐశ్వర్యదత్త, చార్లీ, ఆర్‌ఎస్‌ఆర్.మనోహర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఆరం,వల్లినం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఆరాదుచిన్నం. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయన్నారు. దీంతో ప్రభుత్వం ఆ హత్యా ఉదంతాలను ఛేదించడానికి ఒక స్పెషల్ పోలీస్ అధికారిని నియమిస్తుందన్నారు. ఆ అధికారే అరుళ్‌నిధి అని చెప్పారు. అయితే ఆ హంతకులు ఆ పోలీస్ అధికారిని, ఆయన కుటుంబాన్ని సమస్యలకు గురి చేస్తారన్నారు.

 వాటిని అధిగమించి పోలీస్ అధికారి హంతకుల్ని పట్టుకున్నారా? తన కుటుంబాన్ని రక్షించుకున్నారా? ఇంతకీ ఆ హంతకులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? లాంటి పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే ఆరాదుచిన్నం అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు తిరువళ్లువర్ తిరుక్కురలోని అధికారం అనే భాగం నుంచి ఒక పాటను రూపొందించడం విశేషం అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, మదురై, పాండిచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement