హాలీవుడ్ సినిమాకు మురుగదాస్‌ డైలాగ్స్‌! | Ar Murugadoss To write Dialogues For Avengers End Game | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సినిమాకు మురుగదాస్‌ డైలాగ్స్‌!

Feb 15 2019 4:04 PM | Updated on Feb 15 2019 4:04 PM

Ar Murugadoss To write Dialogues For Avengers End Game - Sakshi

సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమా సంభాషణలు రాసేందుకు అంగీకరించాడు. తన సినిమాలకు కథ, డైలాగ్స్ తానే రాసుకునే ఈ స్టార్‌ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాలకు ఇంతవరకు ఎప్పుడూ పనిచేయలేదు. అయితే ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కోరిక మేరకు డైలాగ్స్ రాసేందుకు అంగీకరించారట. సూపర్‌ హిట్‌ అడ్వంచర్‌ మూవీ సిరీస్‌ అవెంజర్స్‌ నుంచి కొత్త సినిమా ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ రాబోతోంది.

ఈ సినిమాను భారత్‌లోనూ భారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు డబ్బింగ్ డైలాగ్స్ రాసేందుకు పలువురు ప్రముఖులను సంప్రదించారు. ఈ సినిమా తమిళ వర్షన్‌కు డైలాగ్స్‌ రాసేందుకు మురుగదాస్‌ అంగీకరించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్‌ ఉన్న మురుగదాస్‌ డైలాగ్స్‌ రాస్తుండటంతో అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌కు సౌత్‌లో మంచి హైప్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement