స్వీటీకి...కోపం వచ్చిందా? | Anushka Shetty Upset About Marriage Rumours With Prabhas | Sakshi
Sakshi News home page

స్వీటీకి...కోపం వచ్చిందా?

Jun 9 2017 12:09 AM | Updated on Oct 3 2018 7:48 PM

స్వీటీకి...కోపం వచ్చిందా? - Sakshi

స్వీటీకి...కోపం వచ్చిందా?

స్వీట్‌ స్వీట్‌గా క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడే స్వీటీ.. అదేనండి అనుష్కకు కోపం వచ్చినట్లుంది.

స్వీట్‌ స్వీట్‌గా క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడే స్వీటీ.. అదేనండి అనుష్కకు కోపం వచ్చినట్లుంది. అందుకే ‘ఇలాంటి వార్తలు రిపీట్‌ అయితే సహించేది లేదు’ అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లున్నారు. ఇంతకీ మ్యాటర్‌ ఏంటంటే ప్రభాష్‌–అనుష్కా జోడి సిల్వర్‌ స్క్రీన్‌పై సూపర్‌ హిట్‌. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలతో ప్రభాస్‌– అనుష్కా హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగుంటుంది.

అందుకే గాసిప్‌ రాయుళ్లు ఆఫ్‌ స్క్రీన్‌లో ఈ ఇద్దరికీ ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఎప్పటికీ ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడవని అనుష్క అనుకున్నారేమో. ‘‘అనవసరమైన కథలు సృష్టించవద్దు. ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడను’ అని అనుష్క పేర్కొన్నారు. ఈ మాటలను బట్టి కూల్‌ గాళ్‌ అనుష్కకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ సంగతలా ఉంచితే.. ఈ మధ్య అనుష్క భక్తి బాట పట్టారనిపిస్తోంది. ఆ విషయంలోకి వస్తే...

కేరళలో పూజలు...
ఇటీవల మహాలింగేశ్వర దేవాలయంలో పూజలు చేసిన అనుష్క తాజాగా కేరళలోని కొల్లూరులో గల మూకాంబిక దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ‘భాగమతి’ సినిమాలో తనకు కో–స్టార్‌గా చేస్తోన్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తన కుటుంబ సభ్యులతో కలసి అనుష్క కేరళ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఉన్ని ముకుందన్‌ స్నేహితుడి ఆయుర్వేద షాపులో కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ కొన్నారట.

Advertisement
 
Advertisement
Advertisement