
విరాట్ కోహ్లీని అప్ సెట్ చేసిన అనుష్క!
టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మ వ్యవహారశైలిపై అసహానానికి గురయ్యాడు.
టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మ వ్యవహారశైలిపై అసహనానికి గురయ్యాడు. ఇందుకు అనుష్క శర్మ ఓ మేగ్ జైన్ కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ప్రధాన కారణమట. స్కిన్ షోలో భాగంగా మేగజైన్ లో అనుష్క హాట్ హాట్ గా కనిపించింది. దీంతో కాస్త విసుగు చెందిన కోహ్లీ.. అనుష్క శర్మను నిలదీశాడట.
అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ఆమెను ఫోన్ లో ప్రశ్నించాడు. ఆ జంట పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో హాట్ ఫోటో షూట్ అంశం వారి మధ్య చిన్నపాటి చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీకి అనుష్క శర్మ అంశంతో ఏమేరకు రాణిస్తాడో చూడాల్సిందే.