హోలీకి పరీ | Anushka Sharma’s scars in ‘Holi With Pari’ will give you goosebumps | Sakshi
Sakshi News home page

హోలీకి పరీ

Jan 11 2018 12:28 AM | Updated on Jan 11 2018 3:04 AM

Anushka Sharma’s scars in ‘Holi With Pari’ will give you goosebumps - Sakshi

మంగళవారం... నైట్‌ పదిన్నర టైమ్‌లో స్వీట్‌ డ్రీమ్స్‌ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కా శర్మ ఓ 18 సెకన్ల  వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కొత్త పెళ్లికూతురు.. అది కూడా నైట్‌ టైమ్‌లో స్వీట్‌ డ్రీమ్స్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అందుకని ఇదేదో రొమాంటిక్‌ వీడియో అయ్యింటుందని ఊహిస్తే పొరపాటే. ఎందుకంటే ఆమె పోస్ట్‌ చేసింది తన అప్‌కమింగ్‌ మూవీ ‘పరీ’కి సంబంధించిన వీడియో. ‘వామ్మో ఏంటిది?’ అంటున్నారు ఆ వీడియో చూసిన ప్రేక్షకులు. ఎందుకంటే అంతలా భయపెట్టారామె. ఇప్పుడామె ఈ  వీడియోను పోస్ట్‌ చేయడానికి ఓ రీజన్‌ ఉందండోయ్‌. అదేంటంటే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చేంజ్‌ చేశారు. ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వంలో అనుష్కా శర్మ, పరమ్‌భట్‌ ఛటర్జీ ముఖ్య తారలుగా రూపొందుతున్న హారర్‌ చిత్రం ‘పరీ’.

‘నాట్‌ ఏ ఫెయిరీ టేల్‌’ అనేది ఉపశీర్షిక. అంటే.. అద్భుతమైన కథ ఏం కాదు అని అర్థం. ఈ సినిమాను తొలుత ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ హోలీ సందర్భంగా సినిమాను మార్చి 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే... ఇదే రోజున విశాల్‌ పాండ్య దర్శకత్వంలో ఊర్వశి రౌతేలా లీడ్‌ రోల్‌ చేసిన ‘హేట్‌ స్టోరీ 4’, తరుష్‌ మనుష్కాని దర్శకత్వంలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, విక్రమ్‌ జిత్, సప్నా పబ్బి ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘డ్రైవ్‌’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ మూడు సినిమాలూ హోలీకి ట్రిపుల్‌ ధమాకా ఇస్తాయా? లేక ఏదైనా వాయిదా పడుతుందా? అనేది చూడాలి. ఎందుకంటే,  రీసెంట్‌గా చాలా హిందీ చిత్రాలు ఎనౌన్స్‌ చేసిన రిలీజ్‌ డేట్స్‌ను చేంజ్‌ చేసుకుంటున్నాయి. భాగీ 2, సంజయ్‌దత్‌ బయోపిక్, పద్మావత్, ప్యాడ్‌మ్యాన్, అయ్యారే సినిమాలు ముందు ప్రకటించిన రిలీజ్‌ డేట్స్‌ను మార్చుకున్న క్లబ్‌లోనే ఉన్నాయి. లేటెæస్ట్‌గా ఈ లిస్ట్‌లోకి ‘పరి’ చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement