రాణి పూంగుళలి

Anushka to replace Nayanthara in Ponniyin Selvan - Sakshi

రాణి రుద్రమదేవిగా ‘రుద్రమదేవి’లోను, రాణి దేవసేనగా ‘బాహుబలి’లోనూ అనుష్క ప్రదర్శించిన ధైర్యసాహసాలను మనం చూశాం. రాణి పాత్రలంటే అనుష్కే చేయాలన్నంత బాగా ఈ బ్యూటీ నటించారు. ఇప్పుడు ‘రాణి పూంగుళలి’గా అనుష్క కనిపించబోతున్నారని సమాచారం. ఎవరీ రాణి? ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా?  తమిళచరిత్ర తెలిసినవాళ్లకు పూంగుళలి గురించి తెలుస్తుంది, చోళుల చరిత్ర గురించి ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా మణిరత్నం ఓ భారీ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

ఇందులో రాణి పూంగుళలి పాత్రకు ముందుగా నయనతారను అనుకున్నారట. అయితే వేరే చిత్రాలకు అప్పటికే డేట్స్‌ ఇవ్వడంతో నయనతార ఈ సినిమా చేయలేని పరిస్థితి. దాంతో అనుష్కను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ధైర్యసాహసాలు ప్రదర్శించాల్సిన పాత్ర ఇది. ఇప్పటికే రాణి పాత్రల్లో నిరూపించుకున్నారు కాబట్టి అనుష్క ఈ పాత్రను సునాయాసంగా చేసేస్తారని ఊహించవచ్చు. గత ఏడాది విడుదలైన ‘బహుబలి 2’ తర్వాత అనుష్క కొత్త సినిమాలేవీ సైన్‌ చేయలేదు. ఇటీవలే ‘సైలెన్స్‌’ అనే చిత్రం అంగీకరించారు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా బహు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పుడు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వార్త నిజమైతే మళ్లీ నటిగా అనుష్క బిజీ అయిపోతారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top