కొత్త లుక్‌లో..

anushka new look in silence - Sakshi

ఏడాది కావస్తోంది అనుష్క స్క్రీన్‌పై కనిపించి. ‘భాగమతి’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఎక్కడా కనిపించలేదు. కోన వెంకట్‌ నిర్మాణంలో రూపొందనున్న సైలెంట్‌ థ్రిల్లర్‌ ‘సైలెన్స్‌’లో నటించడానికి అంగీకరించారు కానీ ఆ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ కావడానికి టైమ్‌ ఉంది. ఈ సినిమాలో కంప్లీట్‌ న్యూ లుక్‌లో కనిపించే విషయంపై శ్రద్ధ పెట్టారట అనుష్క. అందుకే మీడియా బయట ఎక్కడా కనిపించడం లేదు. మాధవన్, అనుష్క ముఖ్య పాత్రల్లో ‘వస్తాడు నా రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాకు దర్శకుడు. కోన వెంకట్‌ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.

ఈ లేటెస్ట్‌ థ్రిల్లర్‌ గురించి కోన వెంకట్‌ మాట్లాడుతూ – ‘‘తెలుగులో రాబోతున్న తొలి క్రాస్‌ఓవర్‌ చిత్రం ‘సైలెన్స్‌’. (మన భాష నటులతో సమానంగా లేదా ఎక్కువ సంఖ్యలో వేరే ప్రాంతం, భాష నటులు సినిమాలో కనిపించడాన్ని క్రాస్‌ఓవర్‌ అంటారు). అనుష్క, మాధవన్‌ మరో ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టులు మినహా ఈ సినిమాలో మొత్తం హాలీవుడ్‌ నటులు కనిపించనున్నారు. ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్‌ జరుపుకోనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్‌ మొదలు కానున్న ఈ చిత్రం కోసం అనుష్క ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. ఆమె సరికొత్త లుక్‌ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top