మౌనం వీడారు | Anushka to get back to work next month | Sakshi
Sakshi News home page

మౌనం వీడారు

May 17 2019 12:30 AM | Updated on May 17 2019 12:30 AM

Anushka to get back to work next month - Sakshi

అనుష్కా

ఈపాటికి యూఎస్‌లో సైలెంట్‌గా ‘సైలెన్స్‌’ టీమ్‌ షూటింగ్‌ చేసుకుంటూ ఉండాల్సింది. కానీ జరగలేదు. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్‌ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖర్లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ‘సైలెన్స్‌’ చిత్రం తెరకెక్కనుంది.

అనుష్కా, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్‌ యాక్టర్‌ మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ ముఖ్య తారాగణంగా కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్‌ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్‌ అంతా ఆల్మోస్ట్‌ యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరిక్‌ యాక్టర్స్‌ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘సైలెన్స్‌’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement