ఏదీ శాశ్వతం కాదు | Anucharudu Movie Launched | Sakshi
Sakshi News home page

ఏదీ శాశ్వతం కాదు

Jun 13 2020 6:22 AM | Updated on Jun 13 2020 6:22 AM

Anucharudu Movie Launched - Sakshi

ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రభాకర్‌ ఇప్ప, బాలమురళి

‘సహచరుడు’ చిత్ర దర్శక–నిర్మాత ప్రభాకర్‌ ఇప్ప ‘అనుచరుడు’ పేరుతో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రభు హీరోగా నటించనున్నారు. వెరీగుడ్‌ సినీ స్కూల్‌  పతాకంపై ప్రభాకర్‌ ఇప్ప స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్‌ చైర్మన్‌ బాల మురళి, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ సంయుక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు.  ‘‘ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు అనే కథాంశంతో రూపొందనున్న సందేశాత్మక చిత్రమిది. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు హీరో ప్రభు. దర్శకుడు వరకోటి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రిషి కుమార్, సంగీత దర్శకుడు సాయి శ్రీనివాస్, పాటల రచయిత రామారావు, కెమెరామేన్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement