వచ్చినప్పటి నుంచే వదంతులు

Anu Emmanuel Romance With Dhanush In Her Next Move - Sakshi

సినిమా: తానీరంగంలోకి వచ్చినప్పటి నుంచే తనపై వదంతులు రావడం మొదలయ్యాయని నటి అనుఇమ్మాన్యుయేల్‌ అంటోంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట మాలీవుడ్‌లో నటిగా రంగప్రవేశం చేసి ఆపై టాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ రౌండ్‌ కొట్టేస్తోంది. టాలీవుడ్‌లో తొలి చిత్రం మజ్ను బ్రేక్‌ ఇచ్చినా, ఆ తరువాత పవన్‌కల్యాణ్, అల్లుఅర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలతో నటించినా అవి ఈ అమ్మడిని నిరాశపరచాయి. ఇక కోలీవుడ్‌లో తుప్పరివాలన్‌ చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఇదుగో ఇన్నాళ్లకి నటుడు ధనుష్‌ అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రంలో అనుఇమాన్యుయేల్‌ నాయకిగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న చిట్‌ఛాట్‌..

ప్ర: తమిళంలో రీఎంట్రీ గురించి?
జ: రీ ఎంట్రీ అనడాన్ని నేను అంగీకరించను. నేను తెలుగు, తమిళం రెండు ఇండస్ట్రీస్‌లోనూ ఉన్నాను. అవకాశాలు వచ్చినప్పుడు కాల్‌షీట్స్‌ను బట్టి ఏ భాషా చిత్రాన్ని  అంగీకరించాలన్నది నిర్ణయించుకుంటాను. తుప్పరవాలన్‌ చిత్రం తరువాత తమిళంలో అవకాశాలు వచ్చిన మాట నిజమే. అయితే ఆ సమయంలో కొన్ని తెలుగు చిత్రాలు కమిట్‌ అయి ఉండడంతో తమిళ చిత్రాలను అంగీకరించలేకపోయాను. ఇప్పుడు ధనుష్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం, అందుకు కాల్‌షీట్స్‌ ఉండడంతో నటించడానికి రెడీ అన్నాను.

ప్ర: మీరు నటించిన చిత్రాలు విజయం సాధించకపోవడం గురించి?
జ: తెలుగులో అజ్ఞాతవాసి చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌ కోసం ఒప్పుకున్నాను. అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్ర మాదిరి అజ్ఞాతవాసి చిత్రంలో నా పాత్ర ఉంటుందని తెలుసు. అయినా నటించాను. ఇక అల్లుఅర్జున్‌కు జంటగా నా పేరు సూర్య చిత్రంలో నా పాత్ర బాగానే ఉంటుంది. ఆ చిత్రం తమిళంలోనూ విడుదలైంది. ఒక్కోసారి మనం అనుకున్నది ఒక్కటి జరిగింది మరొక్కటిలా అవుతుంది. నా పేరు సూర్య విషయంలో అదే జరిగింది.

ప్ర: కమర్శియల్‌ చిత్రాలనే ఎంచుకుంటున్నట్టున్నారు?
జ: అలా కమిట్‌ అయ్యి చిత్రాలను ఎంపికక చేసుకోవడం జరగదు. అవార్డు కథా పాత్రల్లో నటించనని నేనెప్పుడూ చెప్పలేదు. కమర్శియల్‌ చిత్రాల్లో హీరోలకే ప్రాముఖ్యత ఉంటుందని తెలుసు. అయినా అలాంటి చిత్రాలతోనే ప్రేక్షకులకు త్వరగా రీచ్‌ అవగలమన్నది నిజం కాదా? అయితే నేను గ్లామర్‌ పాత్రలోన్నే నటిస్తానని చెప్పలేదు. తుప్పరివాలన్‌ చిత్రం చూసిన వారికి ఈ విషయం అర్థం అవతుంది.

ప్ర: తెలుగు చిత్రం గీతాగోవిందంలో నటించే అవకాశం ముందు మీకే వచ్చిందట?
జ: నిజమే. ఆ చిత్ర నిర్మాణం ఆలస్యం కావడంతో వేరే చిత్రానికి కాల్‌షీట్స్‌ ఇవ్వడం జరిగింది. అలా ఆ చిత్రాన్ని చేజార్చుకున్నాను. ఇక మంచి చిత్రాన్ని కోల్పోవడం బాధగానే ఉంది. అయితే విజయ్‌దేవరకొండ, రష్మిక అందులో చక్కగా నటించారు. వారికా విజయం అవసరం కూడా.

ప్ర: పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం గురించి?
జ: సినిమా రంగంలో ఒకరు ఎదుగుతున్నారంటే ఆ వ్యక్తి గురించి రకరకాల చర్చ జరుగుతుంది. అందులో ఎక్కువగా అసత్యాలే ఉంటాయి. నేను ఈ రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచే నాపై వదంతులు మొదలయ్యాయి. అలాంటి వాటిని చదివి నవ్వుకుంటాను. వాటికి బదులు చెప్పుకుంటూ పోతే మన టైమే వృథా అవుతుంది. ఎవరైనా వారి మార్కెట్‌ లెవల్‌ను బట్టే పారితోషి కాన్ని పొందుతారు.అలా నా ప్రతిభకు , డిమాండ్‌కు తగ్గట్టుగా పారితోషికాన్ని పొందుతున్నాను. దాని గురించి చర్చించడం వేస్ట్‌ అన్నది నా అభిప్రాయం.

ప్ర: కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని ఇటీవల ప్రకటించారు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా?
జ: మీకు ప్రేమ వివాహంపై నమ్మకం ఉందా? అని ఒక భేటీలో అడగడంతో అలా చెప్పాను. అందుకు నేను ప్రేమలో పడ్డానని అర్థంకాదు. ఇప్పుడూ చెబుతున్నాను. నాకు ప్రేమపై చాలా నమ్మకం ఉంది. ఆరెంజ్‌ మ్యారేజ్‌ కంటే లవ్‌ మ్యారేజ్‌నే బెటర్‌ అని భావిస్తాను. అందుకు నా కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలా నాకు తగిన వాడి కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఇప్పటి వరకూ నేనెవరినీ ప్రేమించలేదు. అయితే చాలా మంది ఐలవ్యూ చెప్పారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడే నలుగురు లవ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రేమలేఖలు రాస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top