మిస్టర్‌ రావణ | Anoop singh thakur new movie is mister ravana | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ రావణ

Sep 1 2019 12:08 AM | Updated on Sep 1 2019 12:08 AM

Anoop singh thakur new movie is mister ravana - Sakshi

అనూప్‌ ఠాకూర్, సలోని

‘విన్నర్‌’, ‘రోగ్‌’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించిన అనూప్‌సింగ్‌ ఠాగూర్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. అనూప్‌సింగ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మిస్టర్‌ రావణ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో సలోని కథానాయిక. కుందన్‌ ఆర్ట్స్‌ పతాకంపై కుందన్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ చిత్రానికి ఇంద్రజిత్‌ సహ–నిర్మాత. అనూప్‌ మాట్లాడుతూ–‘‘స్క్రిప్ట్‌ బాగుంది. నా క్యారెక్టరైజేషన్‌ను బాగా డిజైన్‌ చేశారు. నటుడిగా నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు సలోని. ‘‘అన్ని భాషల నటీనటులు ఈ సినిమాలో ఉంటారు’’ అన్నారు కుందన్‌ రాజ్‌. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement