వాస్తవ సంఘటనతో... | anjali lakshmi rai new movie is ananda bhairavi | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనతో...

Nov 19 2018 2:30 AM | Updated on Nov 19 2018 2:30 AM

anjali lakshmi rai new movie is ananda bhairavi - Sakshi

అంజలి

‘గీతాంజలి’ ఫేమ్‌ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘ఆనందభైరవి’. లక్ష్మీరాయ్‌ ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. కర్రి బాలాజీ దర్శకత్వంలో హరేవన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రమేశ్‌రెడ్డి ఇటికెల నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ‘ఆనందభైరవి’ తెరకెక్కనుంది. వినోదంతో పాటు ఉత్కంఠ భరితంగా సినిమా సాగుతుంది. అంజలి పాత్ర ప్రతి ఇంట్లో ఉండే అమ్మాయిని గుర్తు చేసేలా ఉంటుంది’’ అన్నారు.

‘‘అంజలికి జోడీగా ఓ యువ కథానాయకుడు నటించనున్నారు. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది’’ అన్నారు రమేశ్‌రెడ్డి ఇటికెల. ‘‘తొలిసారిగా యాక్షన్‌ పాత్ర పోషిస్తున్నా. యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా’’ అని అంజలి చెప్పారు. ‘‘ఇందులో నాది చాలెంజింగ్‌ పాత్ర. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది’’ అన్నారు లక్ష్మీరాయ్‌. రవికిషన్, ‘బాహుబలి’ ప్రభాకర్, ధన్‌రాజ్, ‘సత్యం’ రాజేశ్, ఆశిష్‌ విద్యార్థి, బ్రహ్మాజీ, శ్రీహర్ష తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: పి.జి.విందా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేశ్‌బాబు దత్తి.

Advertisement
 
Advertisement
Advertisement