'పటాస్' కాంబినేషన్లో మరో సినిమా | anil ravipudi to direct kalyan ram again | Sakshi
Sakshi News home page

'పటాస్' కాంబినేషన్లో మరో సినిమా

Oct 19 2016 11:04 AM | Updated on Mar 22 2019 1:53 PM

'పటాస్' కాంబినేషన్లో మరో సినిమా - Sakshi

'పటాస్' కాంబినేషన్లో మరో సినిమా

దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా...

దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది.

అదే జోష్లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మూడో సినిమాను ఎనర్జిటిక్ రామ్ హీరోగా తెరకెక్కించాలని భావించినా., ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి పటాస్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజం సినిమా పూర్తి చేసిన కళ్యాణ్ రామ్, మరోసారి అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

అనీల్ రావిపూడి ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న జూనియర్, నెక్ట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు అనీల్. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement