ఇదే కాంబినేషన్‌లో ఎఫ్-3 తీస్తా | Anil Ravipudi Says F3 Is On The Cards In Nellore | Sakshi
Sakshi News home page

Jan 23 2019 1:40 PM | Updated on Jan 23 2019 1:41 PM

Anil Ravipudi Says F3 Is On The Cards In Nellore - Sakshi

నెల్లూరు సిటీ: విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా త్వరలో ఎఫ్‌–3 చిత్రం తీస్తానని ఎఫ్‌–2 దర్శకుడు అనీల్‌ రావిపూడి తెలిపారు. నెల్లూరులోని ఎస్‌ 2 థియేటర్స్‌లో ఎఫ్‌–2 చిత్ర బృందం మంగళవారం సందడి చేసింది. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ..ఎఫ్‌–2 చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ..ఎఫ్‌–2 చిత్రాన్ని బ్లాక్‌ బాస్టర్‌ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక సినిమా తీసిన తరువాత వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో ఎఫ్‌–3 చిత్రం తీస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్‌ హరి, యూవీ క్రియేషన్స్‌ హెడ్‌ఓడీ మాగుంట ఆదిత్యబాబు పాల్గొన్నారు.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురితో అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రానికి కథ రెడీ చేస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా ది గ్రేట్ చిత్రంలోని రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ నే ఇందులో కూడా చూపించబోతున్నాడట. ఆ పాత్రలోనే రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ హాస్యాన్ని పండించాడు. ఎఫ్3 లో మరింత ఫన్ ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement