చిక్‌మగళూరులో... | Amrutha Varshini Movie Opening | Sakshi
Sakshi News home page

చిక్‌మగళూరులో...

Nov 16 2018 2:18 AM | Updated on Nov 16 2018 2:18 AM

Amrutha Varshini Movie Opening - Sakshi

మేఘశ్రీ, తారకరత్న

నందమూరి తారకరత్న, మేఘశ్రీ జంటగా శివప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అమృత వర్షిణి’. చాందిని క్రియేషన్స్‌ పతాకంపై నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్‌  కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో నారా రోహిత్‌ క్లాప్‌ ఇచ్చారు. తారకరత్న మాట్లాడుతూ– ‘‘కథ నచ్చడంతో పాటు అభిరుచి ఉన్న దర్శక, నిర్మాతలు కావడంతో ఈ సినిమా చేస్తున్నాను. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. మంచి టీమ్‌ కుదిరింది’’ అన్నారు.

‘‘ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే తారకరత్నగారు స్టోరీ ఫైనలైజ్‌ చేశారు. యూత్‌కు, ఫ్యామిలీస్‌కు నచ్చే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. చిక్‌మగళూరులో సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేస్తాం’’ అన్నారు శివప్రభు. ‘‘నిర్మాతగా నా తొలి సినిమా ఇది. శివప్రభు కన్నడంలో నాలుగు సినిమాలు చేశాడు. ఈ నెల 20న రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని నాగరాజు నెక్కంటి అన్నారు. ‘‘ఈ సినిమాలో సైకియాట్రిస్ట్‌ పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు మేఘశ్రీ. ఈ చిత్రానికి కెమెరా: సభా కుమార్, సంగీతం: జెస్సీ గిప్ట్, మాటలు–సహ దర్శకత్వం: సతీష్‌ కుమార్, సహ నిర్మాత: మంజునాథ.

Advertisement
 
Advertisement
Advertisement