అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల | Sakshi
Sakshi News home page

అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల

Published Sun, Dec 31 2017 1:50 AM

AMMAI GIOLA SRIKRISHNA LEELA TEASER RELEASE - Sakshi

సంచలన్‌ ఫిలింస్‌ పతాకం పై ప్రసాద్‌ లక్కన నటించి,  స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల’. కథానాయికగా లీల నటించారు.  ఈ సినిమా టీజర్‌ను ప్రతాని రామకృష్ణగౌడ్, పి. సత్యారెడ్డి, మోహన్‌ రెడ్డిలు ఆవిష్కరించారు. ప్రతాని మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ద్వారా ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఇలాంటి సినిమాను నిర్మించినందుకు నిర్మాతకు నా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. దర్శక–నిర్మాత లక్కన ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా చాలా పవర్‌ఫుల్‌ మీడియమ్‌. దీని ద్వారా ఆక్యూప్రెజర్‌ వైద్య విధానాన్ని చెప్పదలచుకున్నాం. వినోదంతో పాటు ఆరోగ్య సంబంధమెన ఆలోచనలు రేకెత్తించే సన్నివేశాలు ఉంటాయి’’ అని అన్నారు. శ్రీకర సంగమేశ్వరా, యార్లగడ్డ శైలజ, రమణ చాందిని తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: ఆనంద్, ఎడిటింగ్‌: వర్మ, కథ–మాటలు: విద్వాన్‌ ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement