డేట్‌ ఫిక్స్‌

Amma Rajyam Lo Kadapa Biddalu Gets A New Release Date - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రానున్న తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్‌వర్మతో కలిసి సిద్దార్ధ తాతోలు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. టి. అంజయ్య సమర్పణలో అజయ్‌ మైసూర్, టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ నిర్మించారు. రివైజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఏ వర్గాన్నీ టార్గెట్‌ చేసిన చిత్రం కాదు ఇది. ఫ్యాక్షనిజమ్, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంలో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అని చిత్రబృందం వెల్లడించింది. నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రానికి సహనిర్మాతలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top