అమితాబ్ నిర్మాణంలో సౌత్ సినిమా | Amitabh Bachchan To Produce Ajith 58 | Sakshi
Sakshi News home page

అమితాబ్ నిర్మాణంలో సౌత్ సినిమా

Jul 16 2016 10:26 PM | Updated on Sep 4 2017 5:01 AM

అమితాబ్ నిర్మాణంలో సౌత్ సినిమా

అమితాబ్ నిర్మాణంలో సౌత్ సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా పై ఆసక్తికరమైన వార్త ఒకటి కోలివుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అజిత్ హీరోగా తేరి ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్...

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా పై ఆసక్తికరమైన వార్త ఒకటి కోలివుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అజిత్ హీరోగా తేరి ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సొంత నిర్మాన సంస్థ అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా ఈ కాంబినేషన్ పై వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి.

గతంలో కూడా అజిత్ హీరోగా ఓ సినిమా తమిళ సినిమాను నిర్మించాడు బిగ్ బి. అజిత్, విక్రమ్, మహేశ్వరిలు ప్రదాన పాత్రల్లో తెరకెక్కిన ఉల్లాసం సినిమాను నిర్మించాడు బిగ్ బి. ఈ సినిమా విజయం సాధించకపోవటంతో తరువాత సౌత్ సినిమాను నిర్మించే ప్రయత్నం చేయలేదు. దాదాపు 19 ఏళ్ల తరువాత మరోసారి అమితాబ్ సౌత్ లో సినిమాలో సినిమాను నిర్మించనుండటంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement