బర్త్ డేకి మూతి ముడిచేశారు! | Amitabh Bachchan remembers his rebirth today, 33 years after he suffered a near-fatal accident on 'Coolie' | Sakshi
Sakshi News home page

బర్త్ డేకి మూతి ముడిచేశారు!

Aug 3 2015 12:09 AM | Updated on Sep 3 2017 6:39 AM

బర్త్ డేకి  మూతి ముడిచేశారు!

బర్త్ డేకి మూతి ముడిచేశారు!

‘‘నాకోసం ఆ భగవంతుడికి చేతులు జోడించి, ప్రార్థించిన వ్యక్తులందరికీ నా ధన్యవాదాలు’’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందుకలా అన్నారు?..

 ‘‘నాకోసం ఆ భగవంతుడికి చేతులు జోడించి, ప్రార్థించిన వ్యక్తులందరికీ నా ధన్యవాదాలు’’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందుకలా అన్నారు?.. ఆ విషయంలోకే వద్దాం. ఆగస్ట్ 2 అమితాబ్ బచ్చన్ జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. అదే రోజు ఘోరమైన ప్రమాదానికి కూడా గురయ్యారు. 1982లో  బర్త్‌డే నాడు ‘కూలీ’ షూటింగ్‌లో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగింది.

అప్పుడు అమితాబ్‌కి బాగానే దెబ్బ తగిలింది. వెంటనే చిత్రబృందం ఆస్పత్రిలో చేర్చడం, ఆ ప్రమాదం కారణంగా ఆయన రెండు నెలలు విశ్రాంతికి పరిమితం కావడం జరిగింది. అందుకే అమితాబ్ ఆగస్ట్ 2 తనకు పునర్జన్మలా భావిస్తారు. ఆదివారం పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ‘కూలీ’ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇంటిల్లిపాదీ అమితాబ్ పుట్టినరోజు నాడు బాగానే సందడి చేశారు. అమితాబ్, అభిషేక్ అయితే చిన్నపిల్లల్లా మారిపోయి, ఎంజాయ్ చేశారు. మూతి ముడిచేసి, సెల్ఫీలు దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement