పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్‌ | Amitabh Bachchan Pays Off Bihar Farmers Loan | Sakshi
Sakshi News home page

2100 మంది రైతుల బాకీ తీర్చిన మెగాస్టార్‌

Jun 12 2019 3:43 PM | Updated on Jun 12 2019 3:48 PM

Amitabh Bachchan Pays Off Bihar Farmers Loan - Sakshi

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రైతు సమస్యలపై స్పందిస్తూ.. వారికి అండగా ఉండే ఈ మెగాస్టార్‌ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా బిహార్‌లో ఏకంగా 2100 మంది రైతుల రుణాలు తీర్చి రైతు బాంధవుడిగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకన్నా అంటూ ఈ విషయం గురించి అమితాబ్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

ఈ మేరకు...‘ బిహార్‌లోని 2100 మంది రైతుల రుణాలు కట్టాను. ఒకే దఫాలో బ్యాంకుకు పడ్డ బాకీని తీర్చేసాం. శ్వేత, అభిషేక్‌ కొంతమంది రైతులకు నేరుగా చెక్కులు అందించారు. మిగతా వాళ్లకు రైతు నాయకుల ద్వారా అందజేసాం. మాట ఇచ్చాను. ఈరోజు దానిని నిలబెట్టుకున్నా అని బ్లాగులో రాసుకొచ్చారు. కాగా అమితాబ్‌ గతంలో కూడా వందలాది మంది రైతులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ రైతుల బాకీలు తీర్చిన 76 ఏళ్ల ఈ మెగాస్టార్‌ వారి హృదయాల్లో స్థానం సంపాదించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement