మోదీని దాటేసిన అమితాబ్!! | amitabh bachchan corsses narendra modi in twitter followers | Sakshi
Sakshi News home page

మోదీని దాటేసిన అమితాబ్!!

Mar 23 2016 12:17 PM | Updated on Aug 15 2018 2:20 PM

మోదీని దాటేసిన అమితాబ్!! - Sakshi

మోదీని దాటేసిన అమితాబ్!!

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మరో ఘనత సాధించాడు. ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరుకుంది.

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మరో ఘనత సాధించాడు. ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని అమితాబ్ కూడా సగర్వంగా ట్వీట్ చేశాడు. ''బడూంబా... 20 మిలియన్లు!! థాంక్యూ ఆల్.. ఇక 30 మిలియన్ల వైపు వెళ్లాలి!! మీ సమయం వచ్చింది!!" అని తన సందేశంలో పేర్కొన్నాడు.


ఏడు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఉత్సాహంగా అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్న అమితాబ్ బచ్చన్, ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా దాటేశాడు. మోదీకి 18.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, అమితాబ్‌కు ఇప్పటికి 20 మిలియన్ల మంది ఫాలోవర్లు వచ్చారు. అయితే రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ మోదీ అగ్రస్థానంలో ఉండగా, సెలబ్రిటీల విభాగంలో మాత్రం అమితాబ్ టాప్‌గా ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement