కొత్త అవతారం | Amitabh Bachchan all set to compose and sing for his new TV show 'Aaj Ki Raat Hai Zindagi' | Sakshi
Sakshi News home page

కొత్త అవతారం

Oct 5 2015 11:25 PM | Updated on Sep 3 2017 10:29 AM

కొత్త అవతారం

కొత్త అవతారం

అమితాబ్ బచ్చన్ గ్రేట్ యాక్టర్ అనే విషయం జగమెరిగిన సత్యం. ఆయనలో మంచి సింగర్ కూడా ఉన్నారు.

అమితాబ్ బచ్చన్ గ్రేట్ యాక్టర్ అనే విషయం జగమెరిగిన సత్యం. ఆయనలో మంచి సింగర్ కూడా ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడి గాయకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమితాబ్ ఇటీవలే కబడ్డీ ప్రొలీగ్ ప్రమోషనల్ సాంగ్‌ను కూడా ఆలపించారు. ఈ బిగ్ బి ఇప్పుడు సంగీత దర్శకునిగా కూడా మారారు. దాదాపు పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న రియాలిటీ షో ‘ఆజ్ కీ రాత్ హై జిందగీ’.

స్టార్ ప్లస్‌లో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకు సంబంధించిన ఓ పాటను స్వరపరచడంతో పాటు దాన్ని ఆలపించారు. ‘‘సంగీతాన్ని ఆస్వాదిస్తూ దాని కోసమే బతుకుతున్న స్వరకర్తలందరూ నా దృష్టిలో ఆ దైవానికి దగ్గరగా ఉంటారని నా నమ్మకం. మొదటి సారిగా నేను స్వరకర్తగా మారాను. దేవుడి దీవెనలతో అంతా బాగానే రావాలని కోరుకుంటున్నా’’ అని అమితాబ్ తన అనుభూతులను బ్లాగ్‌లో అభిమానులతో పంచుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement