ఫోన్ నెంబర్ ట్వీట్ చేసిన నటి | Amber Rose shares cell phone number on Twitter | Sakshi
Sakshi News home page

ఫోన్ నెంబర్ ట్వీట్ చేసిన నటి

Dec 29 2015 3:58 PM | Updated on Aug 24 2018 8:18 PM

ఫోన్ నెంబర్ ట్వీట్ చేసిన నటి - Sakshi

ఫోన్ నెంబర్ ట్వీట్ చేసిన నటి

అమెరికా నటి, మోడల్ ఆంబర్ రోజ్ తన మొబైల్ ఫోన్ నెంబర్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి చిక్కుల్కోపడింది.

లాస్ఏంజిలెస్: అమెరికా నటి, మోడల్ ఆంబర్ రోజ్ తన మొబైల్ ఫోన్ నెంబర్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి చిక్కుల్లోపడింది. రోజ్ తన ఫోన్ నెంబర్ను ట్వీట్ చేయడం ఆలస్యం అభిమానుల నుంచి వెంటనే వరుసపెట్టి ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చాయి. అభిమానుల ఫోన్ల తాకిడిని తట్టుకోలేక రోజ్ కొన్ని నిమిషాల్లోనే ఫోన్ నెంబర్ గల ట్వీట్ను తొలగించింది.

రోజ్కు ట్విట్టర్లో 31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రోజ్ పొరపాటున తన ఫోన్ నెంబర్ను ట్వీట్ చేసింది. గతంలో కూడా కొందరు సెలెబ్రిటీలు ఇలా ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. చార్లీ షీన్, కేటీ పెర్రీ కూడా తమ ఫోన్ నెంబర్లు వెల్లడించి, తర్వాత తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement