breaking news
cell phone number
-
ఇలాంటి చోరీ గురించి ఎప్పుడైనా విన్నారా!
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటిదాకా మనం సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నగదు, వాహనాలు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ ఫ్యాన్సీ మొబైల్ నంబర్ చోరీకి గురైంది. దీనిపై బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తన ఫోన్ నంబర్ చోరీకి గురైందంటూ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ వివరాలిలా.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నివసించే రాకేష్ చంద్ర గౌరిశెట్టి(28) మూడేళ్ల క్రితం వొడాఫోన్ ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు. గత నెల 17న ఫోన్ స్విచ్చాఫ్ చేసి థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఆయన అనంతరం 21వ తేదీన నగరానికి తిరిగొచ్చేశారు. ఇక్కడికి వచ్చి చూడగా ఫోన్ నో సర్వీస్ అని వచ్చింది. వొడాఫోన్ స్టోర్‌కి వెళ్లాడు. డాక్యుమెంట్లు ఇస్తే కొత్త నంబర్ ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు పత్రాలన్నీ ఇచ్చి మూడు రోజుల తర్వాత మళ్లీ వెళ్లి తీసుకోగా ఆ నంబర్‌కూడా నో సర్వీస్ అని వచ్చింది. దీంతో వొడాఫోన్ నోడల్ ఆఫీస్ బేగంపేటకు వెళ్లి ఫిర్యాదు చేయగా ఒడిశాలోని వొడాఫోన్ స్టోర్‌లో రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. తన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసి తన ప్రమేయం లేకుండానే తన ఫ్యాన్సీ నంబర్‌ను తస్కరించారని ఫిర్యాదులో ఫేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 468, 471 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ నెంబర్ ట్వీట్ చేసిన నటి
లాస్ఏంజిలెస్: అమెరికా నటి, మోడల్ ఆంబర్ రోజ్ తన మొబైల్ ఫోన్ నెంబర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి చిక్కుల్లోపడింది. రోజ్ తన ఫోన్ నెంబర్‌ను ట్వీట్ చేయడం ఆలస్యం అభిమానుల నుంచి వెంటనే వరుసపెట్టి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. అభిమానుల ఫోన్ల తాకిడిని తట్టుకోలేక రోజ్ కొన్ని నిమిషాల్లోనే ఫోన్ నెంబర్ గల ట్వీట్‌ను తొలగించింది. రోజ్‌కు ట్విట్టర్లో 31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రోజ్ పొరపాటున తన ఫోన్ నెంబర్‌ను ట్వీట్ చేసింది. గతంలో కూడా కొందరు సెలెబ్రిటీలు ఇలా ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. చార్లీ షీన్, కేటీ పెర్రీ కూడా తమ ఫోన్ నెంబర్లు వెల్లడించి, తర్వాత తొలగించారు.