ఎంట్రీకు రెడీ | Amar to release on Rebel Star Ambareesh birth anniversary | Sakshi
Sakshi News home page

ఎంట్రీకు రెడీ

Apr 7 2019 3:40 AM | Updated on Apr 7 2019 3:40 AM

Amar to release on Rebel Star Ambareesh birth anniversary - Sakshi

అభిషేక్‌, అంబరీష్‌

కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీష్‌ చనిపోయి వచ్చే నెల 29కి ఏడాది కావస్తోంది. ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అంబరీష్‌ జీవితం ముగిసిన రోజున తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు ఆయన తనయుడు అభిషేక్‌. దర్శకుడు నాగశేఖర్‌ తెరకెక్కించిన యూత్‌ఫుల్‌ మూవీ ‘అమర్‌’ ద్వారా అభిషేక్‌ హీరోగా పరిచయం అవుతున్నారు.

తనయుడి తొలి సినిమా కోసం అంబరీష్‌ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అభిషేక్‌ నటన, ఫైట్స్‌కు సంబంధించిన శిక్షణ, సెట్స్‌కు టైమ్‌కు వెళ్లాలి అనే పాఠాలు కూడా తనయుడికి చెప్పారట. అనుకోకుండా తనయుడి తొలి సినిమాను చూడకుండానే అంబరీష్‌ మరణించారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌ చూస్తే సినిమాలో అంబరీష్‌ డైలాగ్స్, పాటల ప్రస్తావన చాలా ఉండబోతున్నాయి అని స్పష్టం చేసింది. వచ్చే నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement