రెండో పెళ్లికి రెడీ!

Amala Paul Parents Ready To Set Second Marriage to Her - Sakshi

సినిమా: దక్షిణాదిలో పెళ్లీడు దాటిపోతున్న హీరోయిన్ల పట్టిక చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. నయనతార, అనుష్క, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో నయనతార విషయాన్ని పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పటికే దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో సహజీవనం సాగిస్తోంది. అంతేకాదు అసలు ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకు వేరే కథ ఉందనేది ఇప్పటికే వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అవివాహిత అయితే నయనతార ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఒక జ్యోతిష్కుడు చెప్పినట్టు టాక్‌ ఇప్పటికే స్ప్రెడ్‌ అయ్యింది. ఇక అందాల బ్యూటీ అనుష్క త్వరలోనే శుభవార్త వెల్లడించే అవకాశం ఉందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక త్రిష ఆ తరుణం వచ్చినప్పుడు పెళ్లి తప్పకుండా చేసుకుంటానంటోంది. వీళ్ల పెళ్లిళ్ల సంగతేమోగానీ సంచలన నటి అమలాపాల్‌ మాత్రం రెండో పెళ్లికి రెడీ అంటోంది. చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి వెంటనే పెళ్లి కూడా చేసేకున్న అమలాపాల్‌ అంతే త్వరగా ఆయన్నుంచి విడిపోయింది. మళ్లీ నటనకు దగ్గరైన ఈ అమ్మడి రెండో పెళ్లి గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదంటూ వచ్చిన ఈ కేరళా భామ మాటలో ఇప్పుడు తేడా కనిపిస్తోంది. దీని గురించి అమలాపాల్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ చాలా మంది తన పెళ్లి గురించే అడుగుతున్నారని, రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని ప్రశ్నిస్తున్నారని అంది. అయితే రెండో పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదని, అయితే మొదట తాను చేసుకున్న పెళ్లి తన ఇష్టప్రకారం జరిగిందని తెలిపింది. అది సక్సెస్‌ అవ్వలేదని, సో తన రెండో పెళ్లి విషయాన్ని తన తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేశానని చెప్పింది. వారు కుదిర్చిన పెళ్లి కొడుకును చేసుకోవడానికి తాను సమ్మతిస్తానని అంది. అయితే అంత త్వరగా పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం తనకు లేదని పేర్కొంది. దీంతో ఈ అమ్మడికి ఇంట్లో రెండో పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిపిస్తోంది కదూ!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top