సెట్‌లోనే ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

Allu Arjun Watching India pak Match In Movie Set - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఆ పోరును షూటింగ్‌ విరామ సమయంలో తన మొబైల్‌నో చూశారు. దీనికి సంబంధించిన వీడియోను పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం బన్నీ అభిమానులు ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్ను ఈ చిత్రంలో బన్నీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లీకైన స్టిల్స్‌తో బన్నీ అభిమానులు ఖుష్‌ అవుతున్నారు. స్టైలీష్‌ లుక్‌లో ఉన్న తమ హీరోను చూసి తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను వీక్షిస్తున్న వీడియోతో బన్నీ లుక్‌ బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top