క్రిష్‌తో బన్నీ...ప్రయోగానికి సిద్ధమేనా..? | Is Allu Arjun Ready To Act In Director Krish New Movie | Sakshi
Sakshi News home page

క్రిష్‌తో బన్నీ...ప్రయోగానికి సిద్ధమేనా..?

Apr 10 2018 12:25 PM | Updated on Sep 27 2018 8:48 PM

Is Allu Arjun Ready To Act In Director Krish New Movie - Sakshi

డైరెక్టర్‌ క్రిష్‌, అల్లు అర్జున్‌ (ఫైల్‌ ఫోటో)

అల్లు అర్జున్‌ సినిమా అంటే అదిరిపోయే ఫైట్స్‌, స్టెప్స్‌, ఐటంసాంగ్‌, పంచ్‌ డైలాగ్స్‌  ఉండాల్సిందే. స్టైలీష్‌ స్టార్‌ సినిమా..సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎన్నో హిట్‌ చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ ప్రయోగానికి సిద్ధమయ్యాడు.

బన్నీ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్నాడని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు క్రిష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిష్‌తో సినిమా అంటే కమర్షియల్‌ ఫార్మట్‌కు దూరంగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఉండే మాస్‌ మసాలా, హీరోయిజం, ఫైట్‌లు, ఐటంసాంగ్‌లు ఉండవు. గతంలో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో చేసిన ఓ పాత్రతో బన్నీకి మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంత విజయం సాధించలేదు.

అసలే వరుస హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ టైంలో బన్నీ క్రిష్‌తో సినిమా అంటే చేస్తాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి క్రిష్‌ బాలీవుడ్‌ మూవీ మణికర్ణిక షూటింగ్‌లో ఉన్నాడు. త్వరలోనే షూటింగ్‌ పూర్తి కాబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement