సూర్యను ఫాలో అవుతున్న బన్నీ | allu arjun next film with lingusamy | Sakshi
Sakshi News home page

సూర్యను ఫాలో అవుతున్న బన్నీ

Jun 2 2016 8:14 PM | Updated on Sep 4 2017 1:30 AM

సూర్యను ఫాలో అవుతున్న బన్నీ

సూర్యను ఫాలో అవుతున్న బన్నీ

వరుసగా 50 కోట్ల సినిమాలతో సంఛలనం సృష్టిస్తున్న స్టార్ హీరో అల్లు అర్జున్ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సరైనోడు సినిమాతో భారీ బ్లాక్బస్టర్ సాధించిన బన్నీ, ఇప్పటి వరకు తన...

వరుసగా 50 కోట్ల సినిమాలతో సంఛలనం సృష్టిస్తున్న స్టార్ హీరో అల్లు అర్జున్ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సరైనోడు సినిమాతో భారీ బ్లాక్బస్టర్ సాధించిన బన్నీ, ఇప్పటి వరకు తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ, అదే సమయంలో తన నెక్ట్స్ సినిమాను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇప్పటికే తమిళ దర్శకుడితో బైలింగ్యువల్ సినిమా ఉంటుదని చెప్పిన అల్లు అర్జున్, లింగుసామి డైరెక్షన్లో ఓ యాక్షన్ డ్రామాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సూర్య 24 సినిమా తరహాలో లింగుసామి సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేయనున్నాడట.

ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా దాదాపుగా ఇదే సినిమా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన బన్నీ నెగెటివ్ రోల్లో నటిస్తే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement