బన్నీ బాలీవుడ్ ట్రయల్స్‌‌! | Is Allu Arjun Give Entry To Bollywood | Sakshi
Sakshi News home page

Jul 17 2018 12:19 PM | Updated on Apr 3 2019 6:23 PM

Is Allu Arjun Give Entry To Bollywood - Sakshi

బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడితో

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’తో పరాజయాన్ని చూశాడు. సినిమా విడుదలై రెండు నెలలు దాటినా మరో మూవీని కన్‌ఫర్మ్‌ చేయలేదు. విక్రమ్‌ కే కుమార్‌తో సినిమా అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తేగానీ లెక్కలోకి రాదు. 

అల్లు అర్జున్‌ పేరు సోషల్‌ మీడియాలో నిన్నంతా మార్మోగింది. సరైనోడు హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ యూట్యూబ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాను 2కోట్లకు పైగా వీక్షించారు. ఇది ఇండియన్‌ సినిమాలో ఓ రికార్డ్‌. బాలీవుడ్‌లో బన్నీ డబ్బింగ్‌ సినిమాలకు ఉండే క్రేజే వేరు. బన్నీ ఈ ఫాలోయింగ్‌ను క్యాష్‌ చేసుకుందామని ట్రై చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు విక్రమ్‌ కే కుమార్‌, త్రివిక్రమ్‌లతో సినిమాలు ఉండొచ్చని రూమర్స్‌ వస్తే.. ప్రస్తుతం బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ వార్త బయటకు వినిపిస్తోంది. వీటన్నంటిలో ఏది నిజమో తెలియాలంటే బన్నీయే సమాధానం చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement