అర్హ అల్లరి మాములుగా లేదుగా..  | Allu Arjun Funny Video With Arha | Sakshi
Sakshi News home page

అర్హ అల్లరి మాములుగా లేదుగా.. 

Mar 2 2020 10:15 AM | Updated on Mar 2 2020 1:19 PM

Allu Arjun Funny Video With Arha - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్రీ టైమ్‌లో ఫ్యామిలీతో సరదాగా గడుపుతారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్నీ కుమార్తె అర్హ ఆయనతో కలిసి చేసే అల్లరి అంత ఇంత కాదు. గతంలో ‘రాములో.. రాములా’సాంగ్‌లో బన్నీ డ్యాన్స్‌ను దోశ స్టెప్పు అన్న అర్హ.. మరోసారి తన అల్లరితో నవ్వులు పూయించింది. తాజాగా అర్హతో సరదాగా గడిపిన ఓ వీడియోను బన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అర్హను బన్నీ నీ ఫెవరేట్‌ కలర్‌ ఏంటి బే అని అడగ్గా.. అందుకు అర్హ పింక్‌ ‘బే’ అని చెప్పింది. వెంటనే నన్ను ‘బే అంటావా బే’ అని బన్నీ ప్రశ్నించగా.. అర్హ మరింత అల్లరిగా అవును బే అని నవ్వసాగింది. దీనికి బన్నీ ‘కన్నతండ్రిని నన్ను బే అంటావా’ అంటూ కుమార్తెను ప్రేమగా హత్తుకున్నాడు. బన్నీ ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. దీనికి ఫాదర్‌డాటర్‌ లవ్‌, జస్ట్‌ ఫర్‌ పన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను బన్నీ జత చేశాడు.(నాన్‌స్టాప్‌ నలభై రోజులు)

సినిమాల విషయానికి వస్తే ‘అల వైకుంఠపురములో...’ ఘన విజయంతో ఫుల్‌ జోష్‌ ఉన్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్‌ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మార్చి రెండో వారం నుంచి అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. గుబురు గడ్డం, రింగుల జుత్తుతో లారీ డ్రైవర్‌గా ఒక పాత్రలో కనిపిస్తే మరో పాత్రలో స్టయిలిష్‌ బిజినెస్‌మేన్‌గా కనిపిస్తారట. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. (బన్నీ మెచ్చిన షార్ట్‌ ఫిల్మ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement