‘త్వరలో బిగ్‌ న్యూస్‌.. కాస్త వెయిట్ చేయండి’ | Allu Arjun And Trivikram Srinivas Movie Updates Soon | Sakshi
Sakshi News home page

‘త్వరలో బిగ్‌ న్యూస్‌.. కాస్త వెయిట్ చేయండి’

Mar 28 2019 9:50 AM | Updated on Mar 28 2019 9:50 AM

Allu Arjun And Trivikram Srinivas Movie Updates Soon - Sakshi

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ఇటీవల త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ తరువాత ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు. దీంతో అభిమానులు సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన నిర్మాతలు సినిమాకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. ‘అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌  శ్రీనివాస్‌ల కాంబినేషన్‌పై అభిమానులతో పాటు మేం కూడా చాలా ఆత్రుతగా ఉన్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న కారణంగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. అన్ని సెట్‌ అయ్యాక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’అంటూ తమ అఫీషియల్‌ ట్విటర్‌ పేజ్‌లో ట్వీట్ చేశారు. అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement