ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

Allu Arjun And Prabhas Attends Gopichands Son Birthday Event - Sakshi

టాలీవుడ్‌లోని యంగ్‌ హీరోలందరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఎలాంటి భేషజాలకు పోకుండా మన హీరోలందరూ కలిసి మెలిసి ఉంటారు. ఏదైనా ఒక హీరో ఇంట్లో ఈవెంట్‌ జరిగితే.. మిగతా హీరోలు ప్రత్యక్షమవుతుంటారు. తాజాగా గోపీచంద్‌ ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్‌కు ప్రభాస్‌, అల్లు అర్జున్‌లు హాజరయ్యారు.

గోపీచంద్‌.. తన కుమారుడు వియాన్స్‌ మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. ఈ వేడుకలకు యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, స్టైలీష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, మంచు విష్ణు, రామ్‌, తేజ, బోయపాటి శ్రీను, సంపత్‌ నంది, వంశీ పైడిపల్లి తదితర ప్రముఖులు హాజరయ్యారు. గోపీచంద్‌ ప్రస్తుతం చాణక్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top