‘కౌశల్‌ను నమ్మొద్దు.. అతనొక మోసగాడు’

Allegations Bigg Boss Kaushal And His Response On Rumors - Sakshi

బిగ్‌బాస్‌ కౌశల్‌.. ఈ పేరు ఒకానొక టైమ్‌లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. కౌశల్ ఆర్మీ పేరిట సోషల్‌ మీడియాలో ఓ చిన్నపాటి యుద్దమే జరిగింది. సేవా కార్యక్రమాలు, 2కే రన్‌లు చేస్తూ.. కౌశల్‌ ఆర్మీ సభ్యులు కౌశల్‌కు మద్దతుకు నిలిచారు. మొత్తానికి బిగ్‌బాస్‌2 సీజన్‌ విజేతగా కౌశల్‌ నిలిచాడు.

అటు తరువాత కౌశల్‌ ఇంటర్వ్యూలు, సన్మాన సభలు, విదేశాల్లో కూడా సభలు నిర్వహించడం, డాక్టరేట్‌ను ప్రధానం చేయడంలాంటి వ్యవహారాలు హల్‌చల్‌ చేశాయి. దీంతో ఒక వర్గం కౌశల్‌పై కుట్ర చేసేందుకు రెడీ అవుతోందని కౌశల్‌ అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే రీసెంట్‌గా మళ్లీ ఇలాంటి ఆరోపణలే వైరల్‌ అయ్యాయి. కౌశల్‌ను నమ్మొద్దని, అతనొక మోసగాడంటూ, కౌశల్‌ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన వుండదని, అభిమానులతో డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటాడే తప్ప తన జేబులోంచి రూపాయి బయటకి తీయడని ఆరోపిస్తోస్తున్నారు. ఎక్కడికి అతడిని రమ్మన్నా కూడా అందులో తనకేంటి లాభమని చూసుకుంటాడని, ప్రతి చిన్న ఈవెంట్‌కి కూడా డబ్బులు ఆశిస్తున్నాడని కౌశల్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తాజాగా ఈ ఆరోపణలపై కౌశల్‌ సోషల్‌ మీడియాలో స్పందించాడు. ఇలా ప్రతీసారి తనపై ఆరోపణలు చేయడం అలవాటైందని, అయినా ప్రతీ దానికి సమాధానం చెప్పుకుంటూ పోవడం తనకేం అవసరం లేదని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇలా వచ్చే ప్రతీ దానిపై స్పందించేంత సమయం కూడా తనవద్ద లేదంటూ.. కావాలనే తనను కించపరచాలని ఇదంతా చేస్తున్నారని విమర్శించాడు. కాలమే వీటన్నంటికి సమాధానం చెబుతుందని, కొంత సమయం ఆగితే నిజాలు అవే బయటకు వస్తాయన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top