ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్‌ న్యూ లుక్‌..! | Allari Naresh New Movie Poster Creates Excitement | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్‌ న్యూ లుక్‌..!

Jan 19 2020 1:23 PM | Updated on Jan 19 2020 2:02 PM

Allari Naresh New Movie Poster Creates Excitement - Sakshi

మొఖం నిండా గాయాలతో రక్తం కారుతుండగా.. ఎర్రటి కళ్లతో ఉన్న నరేష్‌ లుక్‌ ఉత్కంఠ రేపుతోంది. 

చాలా కాలం నుంచి హీరోగా వెండితెరకు దూరంగా ఉన్న అల్లరి నరేష్‌ సినిమా ఓ సరికొత్త సినిమాతో వస్తున్నాడు. నూతన దర్శకుడు విజయ కనకమేడల  దర్శకత్వంలో.. నరేష్‌ చేస్తున్న సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మొఖం నిండా గాయాలతో రక్తం కారుతుండగా.. ఎర్రటి కళ్లతో ఉన్న నరేష్‌ లుక్‌ ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నట్టు తెలుస్తోంది. నరేష్‌కు ఇది 57వ సినిమా కావడం విశేషం. సతీష్‌ వేఘేష్న నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు  ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ నెల 20న సినిమా షూటింగ్‌ ప్రారంభవుతుందని చిత్ర బృందం తెలిపింది.

ఇది లాఉండగా.. ఒకప్పుడు మినిమమ్‌ హిట్‌ గ్యారెంటీగా హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్‌.. కొద్ది కాలంగా వరుస ఫ్లాపులతో ప్రేక్షులను నిరాశ పరుస్తున్నాడు. ఇక యాక్షన్‌ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న తాజా సినిమాతో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మరోవైపు నరేష్‌ నటించిన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ .. ‘బంగారు బుల్లోడు’ త్వరలో విడుదల కానుంది. గతేడాది విడుదలైన సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హిట్‌ చిత్రం మహర్షిలో కీలక పాత్ర పోషించిన నరేష్‌ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
చదవండి: పంథా మార్చుకున్న అల్లరి నరేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement