పంథా మార్చుకున్న నరేశ్‌ | Allari Naresh Is Going To Be Concept Based Telugu Movie | Sakshi
Sakshi News home page

పంథా మార్చుకున్న అల్లరి నరేశ్‌

Nov 12 2019 3:04 PM | Updated on Nov 12 2019 3:04 PM

Allari Naresh Is Going To Be Concept Based Telugu Movie - Sakshi

తన శైలికి భిన్నంగా.. ఓ వినూ​త్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హీరో అల్లరి నరేశ్‌

కెరీర్‌ ఆరంభంలో వరుస సినిమాలతో దూసుకపోయిన అల్లరి నరేశ్‌.. ఆ తర్వాత వరుస అపజయాలతో డీలా పడ్డాడు. దీంతో సినిమాల వేగం బాగా తగ్గించాడు. అయితే మహేశ్‌ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’తో నటుడిగా నరేశ్‌కు వంద మార్కులు లభించాయి. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వైవిధ్యమైన కథలను ఎంచుకునే పనిలో పడ్డాడు ఈ యంగ్‌ హీరో. దీనిలో భాగంగానే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 

హీరో అల్లరి నరేశ్‌ హీరోగా ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో హరీశ్‌ శంకర్‌ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌ కనకమేడల దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచం కానున్నాడు. మోసగాళ్లకు మోసగాడు, అల్లు శిరీష్‌ ఒక్క క్షణం సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సతీష్ వేగేశ్న ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌నున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

ప్రస్తుతం పీవీ గిరి దర్శకత్వంలో ‘బంగారు బుల్లోడు’చిత్రంలో నరేశ్‌ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం దీపావళికే విడుదల కావాల్సి ఉండగా పలుకారణాలతో వాయిదా పడింది. అయితే ‘బంగారు బుల్లోడు’రిలీజ్‌ డేట్‌ను చిత్ర యూనిట్‌ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాతో హీరోగా విజయాల ట్రాక్‌ ఎక్కాలని నరేశ్‌ ఆరాటపడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement