ఆ హీరో బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు | Allari naresh Bachelor Party in hyderabad | Sakshi
Sakshi News home page

ఆ హీరో బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు

May 29 2015 9:14 AM | Updated on Sep 3 2017 2:54 AM

ఆ హీరో బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు

ఆ హీరో బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు

అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్ తన బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు వేయబోతున్నాడు.

హైదరాబాద్ : అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్ తన బ్యాచిలర్ లైఫ్కు శుభం కార్డు వేయబోతున్నాడు.   శుక్రవారం ( మే 29) రాత్రి 9 గంటల 3 నిమిషాలకు నరేష్..  విరూప మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు.  హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహాం జరుగబోతోంది.  మరోవైపు అల్లరి నరేష్ నివాసం.. పెళ్లి సందడి తో కళకళలాడుతోంది.  కుటుంబ సభ్యులు నిన్న అతడిని పెళ్లికొడుకును చేశారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

మరోవైపు ఓ ఇంటివాడు కాబోతున్న నరేష్ ఇటీవల తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చాడు.  ఈ సందర్భంగా స్నేహితులు... మరో వికెట్ డౌన్ అంటూ అతడిని ఆట పట్టించారు.  నరేష్ స్నేహితులు నాని, నిఖిల్, తరుణ్, ఖయ్యుం, శశాంక్ తదితరులు టీజ్ చేస్తూ ఫోటో దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement