అల్లరి అల్లుడు? | Allari Alludu title for Naga Chaitanya`s movie | Sakshi
Sakshi News home page

అల్లరి అల్లుడు?

Mar 8 2017 11:22 PM | Updated on Jul 21 2019 4:48 PM

అల్లరి అల్లుడు? - Sakshi

అల్లరి అల్లుడు?

త్వరలో చెన్నై అల్లుడు కానున్న నాగచైతన్య ప్రేక్షకుల ముందుకూ అల్లుడిగానే రానున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’

త్వరలో చెన్నై అల్లుడు కానున్న నాగచైతన్య ప్రేక్షకుల ముందుకూ అల్లుడిగానే రానున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘అల్లరి అల్లుడు’ టైటిల్‌ ఖరారు చేసినట్టు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా టైటిల్‌ ఇది.

 టైటిలే కాదు... ‘అల్లరి అల్లుడు’లోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘నిన్ను రోడ్డు మీద చూసిన ది లగాయిత్తు..’ చైతూ సినిమాలో ప్రేక్షకులకు వినిపించనుందట! హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌గా ఈ సాంగ్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారట. దీంతో పాటు ‘హలో బ్రదర్‌’లోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘ప్రియరాగాలే గుండెలోన..’ను కూడా రీమిక్స్‌ చేస్తున్నారని వినికిడి.

 ఫ్యామిలీ అండ్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌.
దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement