నన్ను అసభ్యంగా తాకి వేధించాడు: టాప్‌ హీరో | Akshay Kumar Reveals He Was 'Touched Inappropriately' | Sakshi
Sakshi News home page

నన్ను అసభ్యంగా తాకి వేధించాడు: టాప్‌ హీరో

Jul 28 2017 1:04 PM | Updated on Apr 3 2019 6:34 PM

నన్ను అసభ్యంగా తాకి వేధించాడు: టాప్‌ హీరో - Sakshi

నన్ను అసభ్యంగా తాకి వేధించాడు: టాప్‌ హీరో

తనను ఓ లిఫ్ట్‌మేన్‌ అసభ్యకరంగా తాకాడని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ తెలిపారు.

ముంబయి: లైంగిక వేధింపులు మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఉంటాయనే విషయం కొన్ని సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే, నేరం బయటకు వస్తే తప్ప పురుషులకు సంబంధించిన అలాంటి సంఘటలు వెలుగుచూడటం చాలా అరుదు. బయటకు చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం కూడా ఇందుకు కారణం. కానీ, ఇలాంటి విషయాలను చెప్పడంలో తాను ఎప్పుడూ ముందుటానని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ మరోసారి స్పష్టం చేశారు. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ముంబయిలో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలుడిగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్మొహమాటంగా బయటకు చెప్పేశారు.

’నేను మీతో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను బాలుడిగా ఉన్న సమయంలో మేం ఉంటున్న చోట లిఫ్ట్‌ ఆపరేట్‌ చేసి వ్యక్తి నన్ను అనుచితంగా తాకేవాడు. లైంగికంగా ఇబ్బంది పెట్టేవాడు. అయితే, మా తల్లిదండ్రులతో నాకున్న స్వేచ్ఛాయుత సంబంధాల కారణంగా వారికి ఈ విషయం తెలియజేశాను. ఆ తర్వాత ఆ లిఫ్ట్‌ వ్యక్తి ఇలాంటివి ఎన్నో చేశాడని తెలిసింది. మనపై జరిగిన లైంగిక వేధింపులు చెప్పుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడొద్దు. ఇలా చేయడం ద్వారా నిరోదక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని అక్షయ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement