అందుకే వద్దనుకున్నా!

Akshay Kumar to play the villain opposite Kamal Haasan indian 2 - Sakshi

రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ (‘రోబో’కు సీక్వెల్‌) సినిమాలో విలన్‌గా కనిపించారు అక్షయ్‌ కుమార్‌. ఇప్పుడు శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’ (‘భారతీయుడు’ సీక్వెల్‌). ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదన్నారు అజయ్‌. ‘‘శంకర్‌ దర్శకత్వంలో నటించడం నాకు ఇష్టమే. ‘ఇండియన్‌ 2’ సినిమాకోసం చర్చలు జరిగాయి. కానీ ప్రస్తుతం నేను ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్నాను. అందుకే కుదర్లేదు’’ అని చెప్పారు  అజయ్‌దేవగణ్‌. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ చేస్తున్న ‘తానాజీ...’ ఆయనకు నూరవ చిత్రం కావడం విశేషం. విడుదలకు సిద్ధమైన అజయ్‌ ‘టోటల్‌ ధమాల్‌’ను పాకిస్తాన్‌లో విడుదల చేయకూడదని చిత్రబృందం నిర్ణయించుకుంది. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top