రాజాధిరాజా

Akshay Kumar to play a 16th century king in Housefull 4 - Sakshi

విభిన్న సినిమాలు, విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. ఇటీవల రిలీజైన ‘కేసరి’లో అక్షయ్‌ తలపాగా కట్టుకున్న సిక్కు పాత్రలో కనిపిస్తే తదుపరి చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’లో గుండుతో కనిపిస్తారట. ‘హౌస్‌ఫుల్‌’ కామెడీ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఇది. అక్షయ్‌ కుమార్, బాబీ డియోల్, రితేశ్‌ దేశ్‌ముఖ్, రానా, కృతీ సనన్, కృతీ కర్బందా, పూజా హెగ్డే, బొమ్మన్‌ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.

పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ ఉండబోతోందని టాక్‌. సినిమాలో అక్షయ్‌ కుమార్‌ 16వ శతాబ్దపు రాజుగా నటించారట. గుండు, మెలి తిరిగిన మీసాలతో అక్షయ్‌ లుక్‌ ఉండబోతోంది. పొడుగు జుట్టుతో బాబీ డియోల్‌ గెటప్‌ ఉండబోతోందట. గత జన్మలో జరిగిన కథను రాజస్థాన్‌లో, ప్రస్తుత కథను లండన్‌లో షూట్‌ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడంతో నానా పటేకర్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో రానా నటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top