కిలాడి స్టార్‌కు గాయాలు | Akshay Kumar injured In Sooryavanshi Shooting | Sakshi
Sakshi News home page

కిలాడి స్టార్‌కు గాయాలు

Nov 10 2019 1:07 PM | Updated on Nov 10 2019 1:34 PM

Akshay Kumar injured In Sooryavanshi Shooting - Sakshi

ముంబై: బాలీవుడ్‌​ కిలాడి అక్షయ్‌కుమార్‌కు ‘సూర్యవంశీ’ సినిమా షూటింగ్‌లో ఎడమచేతి కండరానికి గాయమైంది. అయితే, అక్షయ్‌ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ గాయం  అక్షయ్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కత్రినాకైఫ్‌తో ఉన్న ఈ వీడియోను అక్షయ్‌ షేర్‌ చేశారు. ఈ వీడియోలో అక్షయ్‌కు గాయమైనట్టు, గాయమైన భాగంలో బ్లాక్‌ ప్యాచ్‌ ధరించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.  కాగా అక్షయ్‌  ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో తొలిసారిగా నటించారు. ఈ మ్యూజిక్‌ వీడియోపై స్పందించిన అక్షయ్‌ మాట్లాడుతూ ...‘నేను అన్ని కామెంట్లను చూస్తున్నాను. ఈ వీడియో చూస్తే నమస్తే లండన్‌ సినిమా గుర్తొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నేను నమస్తే లండన్‌లో నటించిన కత్రినాతోనే సూర్యవంశీలో నటించడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement