అంచనాలను పెంచేసిన గోల్డ్‌ ట్రైలర్‌

Akshay Kumar Film Gold Trailer Released - Sakshi

1948 లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ హకీలో గోల్డ్‌ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్‌లో  తెరకెక్కిన చిత్రమే ‘గోల్డ్’‌. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. 2:18నిమిషాల పాటు కొనసాగిన ‘గోల్డ్‌’ ట్రైలర్‌, పేరుకు తగినట్లుగానే బంగారం లాంటి సినిమా అనిపిస్తుంది.

‘గోల్డ్‌, బ్రిటిష్‌ ఇండియా’ అనే వాయిస్‌ ఓవర్‌తో 1936 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో బ్రిటీష్‌ జెండా వైవు తదేకంగా చూస్తున్న అక్షయ్‌ కుమార్‌ కళ్లల్లో ‘ఇది కాదు నేను కోరుకున్నది’ అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైలర్‌లోనే ఈ ఖిలాడీ హీరో దేశభక్తితో పాటు క్రీడల పట్ల తన ప్రేమను ఏక కాలంలోఅద్భుతంగా ప్రదర్శించాడు. బుల్లితెర ధారవాహిక ‘నాగిని’ ఫేం మౌనీ రాయ్‌ అక్షయ్‌ను బెంగాలీలో తిడుతూ ఓ 5 సెకన్ల పాటు కనిపించింది.

ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడిగా మౌనీరాయ్‌ నటించిన సంగతి తెలిసిందే. కాగా మౌనీరాయ్‌కు ఇదే తొలి బాలీవుడ్‌ చిత్రం. ఒకదాని తరువాత ఒకటిగా ఇతర పాత్రల్లో నటించిన కునాల్‌ కపూర్‌, అమిత్‌ సాద్‌, వినీత్‌ కుమార్‌ సింగ్‌, సన్నీ కౌశ్‌ల్ల పాత్రల పరిచయం  ఉంటుందిం. వీరందరిని దేశం తరుపున హాకీ ఆడే ఆటగాళ్లుగా పరిచయం చేస్తూ ట్రైలర్‌ కొనసాగింది. ఈ చిత్రంలో అక్షయ్‌ స్వతంత్ర భారతావని తరుపున ఒలంపిక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించే హాకీ జట్టు కోచ్‌ ‘తపం దాస్‌’ పాత్రలో కనిపించనున్నారు.

చిత్రం తెరకెక్కింది. అక్షయ్‌ కుమార్‌, మౌనీ రాయ్‌, అమిత్‌ సద్‌, వినీత్‌ సింగ్‌, సంగీత్‌ కౌశల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్‌ సిద్వానీ, ఫరాన్‌ అక్తర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్‌’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top