ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల.. మన్మథుడు 2

Akkineni Nagarjuna, Rakul Preet Singh Starrer Manmadhudu 2 Trailer - Sakshi

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్‌ దర్శకుడు. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌లో నాగ్ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో చూపించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో కలిసి నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top