ఖుషీ ఖుషీ స్టెప్స్

హైదరాబాద్‌లో స్టెప్స్ వేస్తున్నారు అఖిల్. తనతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా కాలు కదుపుతున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నది సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాట అని తెలిసింది. పూజాతో కలసి ఖుషీ ఖుషీగా స్టెప్స్ వేస్తున్నారట అఖిల్. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం దర్శకుడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి