‘మిస్టర్‌ మజ్ను’ అప్‌డేట్‌ ఇచ్చాడు..!

Akhil Mr Majnu Shooting Update - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ను అఖిల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘ప్రస్తుతం మిస్టర్‌ మజ్ను సినిమా ప్యాచ్‌వర్క్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌ 3తో ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తవుతుంది. జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాం. ఇన్నాళ్లు ఓపిగ్గా ఎదురుచూసినందుకు థ్యాంక్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు అఖిల్‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top