‘అభిమన్యుడు’ దర్శకుడితో అఖిల్..!

Akhil Akkineni Team up With Abhimanyuudu Director Ps Mithran - Sakshi

ప్రస్తుతం మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అఖిల్‌ అక్కినేని తదుపరి చిత్రాలను కూడా ఫైనల్‌ చేసేస్తున్నాడు. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మిస్టర్ మజ్ను చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత ఓ తమిళ దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట అఖిల్.

విశాల్‌ హీరోగా ఇరుంబు తిరై (తెలుగులో అభిమాన్యుడు) సినిమాను తెరకెక్కించిన పీయస్‌ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్‌కు లైన్‌ వినిపించిన మిత్రన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్‌. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top